Temple | శ్రీ రాఘవుడి సేవలో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి …

Temple | శ్రీ రాఘవుడి సేవలో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి …

Temple | మంత్రాలయం, ఆంధ్రప్రభ : ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన దేశంలో రెండో తిరుపతిగా పేరుగాంచిన మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి(Sri Raghavendra Swamy)ని దర్శించుకోవడానికి కర్ణాటక యాక్టర్ అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి(Rishab Shetty) కుటుంబం సమేతంగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు.

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు(officials) వారికి ఘనస్వాగతం పలికారు. ముందుగా మంచాలమ్మ దేవిని దర్శించుకుని కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం బృందావన సేవలో పాల్గొనగా, మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థులు వారికి ఫల మంత్రాక్షికలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీపతి స్వామి, ఐపి నరసింహ మూర్తి, మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply