Temple | వెంక‌న్న‌కు మాజీ ఎమ్మెల్యే పూజ‌లు

Temple | వెంక‌న్న‌కు మాజీ ఎమ్మెల్యే పూజ‌లు

Temple | శావల్యాపురం, ఆంధ్రప్రభ : రానున్న నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాల‌ని వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు(Bolla Brahmanaidu) అన్నారు. శావల్యాపురం మండలంలోని తన స్వగ్రామమైన వేల్పూరులో వేంచేసి ఉన్న శ్రీ భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామిని దర్శించున్నారు. ఆల‌యంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సరం, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులంతా పాడిపంటలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయనతోపాటు మండల వైసీపీ యూత్ అధ్యక్షుడు బొల్లా సుబ్బారావు, వేల్పూరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply