భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు పూర్తి..

భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు పూర్తి..
- ఆలయ కమిటీ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 15 నుండి 20 వరకు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల అపార సహకారంతో విజయవంతంగా పూర్తయ్యాయని ఆలయ కమిటీ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించామని చెప్పారు.పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జాతర సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు.ఉత్సవాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా శాంతియుతంగా సాగేందుకు సహకరించిన దాతలు, గ్రామ పెద్దలు, యువకులు,మహిళా సంఘాల సభ్యులు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామ ఐక్యతను మరింత బలపరుస్తాయని చైర్మన్ పేర్కొన్నారు.
