Temple | భక్తులకు ఏర్పాట్లు..

Temple | భక్తులకు ఏర్పాట్లు..

  • శ్రీ‌శైలంలో డిసెంబరు 30న ముక్కోటి ఏకాదశి ఉత్సవం

Temple | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి(Srisailam Bhramarambika Mallikarjuna Swamy) దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించబడుతుందని కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఉత్సవం సందర్భంగా వేకువజామున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉత్తరద్వార దర్శనం, రావణవాహనసేవ నిర్వహించబడుతాయన్నారు.

ఉత్స‌వాల‌లో భాగంగానే ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తర ద్వారం నుంచి వెలుపలకు తోడ్కొని వచ్చి ఆలయ ఉత్తరభాగంలో రావణవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపించబడతాయన్నారు. ముక్కోటి ఏకాదశి(Mukkoti Ekadashi) రోజు ఉదయం 3గంట‌లకు ఆలయ ద్వారాలను తెరచి మంగళ వాయిద్యాల అనంతరం గం.3.30ని.లకు స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించబడుతుందన్నారు.

Temple |

అనంత‌రం స్వామిఅమ్మవార్లకు ప్రాత:కాల పూజలు నిర్వ‌హించి గం.4.30 ని.లకు స్వామివారికి, తరువాత అమ్మవారికి మహా మంగళ హారతులు జరిపించబడతాయన్నారు. అనంతరం ఉదయం 5. 30నిలకు రావణ వాహనసేవ జరిపించబడుతుందన్నారు. ఆ తరువాత స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించబడుతుందన్నారు. ఉదయం 6 గంటల త‌ర్వాత దర్శనాలు, ఆర్జితసేవలు ప్రారంభమవుతాయన్నారు. భక్తులకు ప్రత్యేక ఏర్పాటు(special arrangement) చేశామని తెలిపారు.

Leave a Reply