మిట్ట ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట..

మిట్ట ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట..
వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : పెబ్బేరు పట్టణంలోని మిట్ట ఆంజనేయస్వామిదేవాలయంలో సోమవారం రోజు ధ్వజస్తంభం (గడ స్తంభం) ప్రతిష్ట కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది. వేద మంత్రాల నినాదాలతో, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై, ఆంజనేయ స్వామిని తండోపతండాలుగాదర్శించుకున్నారు.
ప్రతిష్ట అనంతరం ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల కోరికలను తీర్చే మహిమగల దేవుడిగా ఆంజనేయస్వామిని భక్తులు కొనియాడుతూ, తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన గంగమ్మ తల్లి గుడి ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని నింపింది.


