స్వామిని దర్శించుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్

స్వామిని దర్శించుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మైన బూదగవిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆదివారం రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో, పూర్ణ కుంభాలతో ఆయనకు స్వాగతం పలికారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో, శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆయన పేరుటన ప్రత్యేక పూజలను నిర్వహించారు. అర్చకులు స్వామి వారి విశిష్టతను వివరించారు.

గాజుల ఆదెన్న కు సన్మానించి సత్కరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను, సూర్యనారాయణ స్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భోగన్న గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ చత్రగుడి చిరంజీవి, కమిటీ సభ్యులు మహేంద్ర గౌడ్, చత్రగుడి సుధాకర్, చక్రి, నాగేంద్ర, గోవిందు, వీఆర్వో కృష్ణ కీర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply