వెండి తాపడం తయారీకి రూ.50,516 లు విరాళం…..

వెండి తాపడం తయారీకి రూ.50,516 లు విరాళం…..

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మవారి ఆలయంలో సహదేవతగా వెలుగొందుతున్న అంకమ్మవారి ఉపాలయం గోపురం వెండి తాపడం తయారీకి ఆదివారం గ్రామానికే చెందిన గుగులోతు వెంకటేశ్వరరావు, కోటమ్మ దంపతులు రూ.50,516లు విరాళం ఆలయ ఈఓ బి మహేశ్వరరెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

ఈసందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటంతో సత్కరించారు. ఈకార్యక్రమంలో ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు చుంచు రమేష్ బాబు, గుగులోతు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply