Temple | ఆలయ అభివృద్ధికి సహకారం

Temple | ఆలయ అభివృద్ధికి సహకారం
- ఉమామహేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
Temple | అచ్చంపేట, ఆంధ్రప్రభ : శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి గాంచిన రంగాపురం గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానాన్ని మహబూబ్‌నగర్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు, భక్తులకు నిత్యాన్నదానం ప్రశంసనీయం అన్నారు. ఆలయ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ఆధ్యాత్మికతను కలిగించేలా మారిందని కొనియాడారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలు, వసతులు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు, అర్చకులు శాలువాతో అదనపు కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఆయన, ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వీరయ్య శాస్త్రి, పాలకమండలి సభ్యులు పవన్ కుమార్, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
