స్వామి వారి తత్త్వంపై అనుగ్రహ భాషణ

స్వామి వారి తత్త్వంపై అనుగ్రహ భాషణ
మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానంనందు నైమిశారణ్య శ్రీ వారాహి పీఠాధిపతులు, హిందూ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి స్వామివారిచే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తత్త్వంపై అనుగ్రహ భాషణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ & కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
స్వామివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మహిమ, ఆధ్యాత్మిక తత్త్వం, భక్తి మార్గం, సనాతన ధర్మ పరిరక్షణ గురించి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించి భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు గారు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహ భాషణాన్ని శ్రద్ధగా ఆస్వాదించారు.
