Temple | భక్తిశ్రద్ధలతో ఘనంగా…

Temple | భక్తిశ్రద్ధలతో ఘనంగా…
- ఆలయాల్లో శివ నామస్మరణలతో మార్మోగాయి
Temple | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదినాన అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రముఖ శైవ క్షేత్రలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. శివ నామస్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బూదగవి గ్రామంలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము న ఆలయ అర్చకులు బసవరాజు స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, రుద్రాభిషేకం, బిల్వ అర్చన, అలంకరణ, పూజ కార్యక్రమాలను నిర్వహించి, మహా మంగళహారతి కార్యక్రమాలు చేపట్టారు. సూర్యనారాయణ స్వామి ఆలయంలో అర్చకులు ప్రకాష్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
పెద్ద ముష్ఠూర్ లోని అతి పురాతన సిద్దేశ్వర స్వామి ఆలయంలో మహాశివ రాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. పార్వతి పరమేశ్వర కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
మహాశివ రాత్రి సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అదేవిధంగా చిన్న ముష్టూర్, మోపిడి, ఆమిద్యాల, రాయంపల్లి, రాకెట్ల గ్రామాలలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఎస్సై జనార్దన్ నాయుడు బందోబస్తు ఏర్పాటు చేశారు.
