మహాత్మా జ్యోతి రావు ఆశా జ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త

మహాత్మా జ్యోతి రావు ఆశా జ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త

కృత్తివెన్ను – ఆంధ్రప్రభ : కృత్తివెన్ను మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేష కృషిచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయునికి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరుగని పోరాటం చేశారు అన్నారు. సమ సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. అటువంటి ఉద్యమకర్త, సంఘసేవకుడు, సామాజిక తత్వవేత్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, మహాత్మ జ్యోతిరావు పూలేను యువత స్పూర్తిగా తీసుకొని అన్ని రంగాలలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply