Telangana | శానసమండలి వద్ద ఉద్రిక్తత..

Telangana | శానసమండలి వద్ద ఉద్రిక్తత..

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రభుత్వంపై తీవ్రంగా స్పందిస్తూ ఆందోళనకు దిగారు. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్సీలు నిరసనలు చేపట్టారు.

మంత్రిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మండలి భవనం ఎదుట నినాదాలు చేశారు. “పొంగులేటి రాజీనామా చేయాలి”, “ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి” వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ క్రమంలో సభా ప్రాంగణంలో ఉద్రిక్తత పెరగడంతో మార్షల్స్ జోక్యం చేసుకున్నారు. సభ్యులను అడ్డుకునే ప్రయత్నంలో కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. ప్లకార్డులు ప్రదర్శించవద్దని సూచించినప్పటికీ, బీఆర్ఎస్ సభ్యులు నిరసనను కొనసాగించారు. దీంతో సభా కార్యక్రమాలు కొంతసేపు అంతరాయం కలిగాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

Leave a Reply