Telangana | రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు కడెం విద్యార్థి

Telangana | రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు కడెం విద్యార్థి

Telangana | కడెం/ నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : కడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( Kadem Zilla Parishad High School) తొమ్మిదవ తరగతి విద్యార్థి సయ్యద్ ఫర్జానుద్దీన్ అండర్ – 17 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల (Under-17 state-level cricket competition)కు ఎంపికయ్యాడని పాఠశాల హెచ్ ఎం ఎం.శ్రీనివాసరెడ్డి (M. Srinivasa Reddy), ఫిజికల్ డైరెక్టర్ బి.వెంకటరమణ తెలిపారు. ఈనెల 21న అదిలాబాదులోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన జోనల్ స్థాయి క్రికెట్ పోటీలలో పాల్గొని మంచి ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎంపికైనట్లు వారు తెలిపారు.

త్వరలో మహబూబ్ నగర్ లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో (state-level cricket competition) పాల్గొనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని వారు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపట్ల పాఠశాల హెచ్ఎం ఏం శ్రీనివాసరెడ్డి, పి డి. వెంకటరమణ, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, విద్యార్థినీ, విద్యార్థులు అభినందించారు.

Leave a Reply