Telangana | హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు – ప్రమాణం చేయించిన సీజే సుజయ్ పాల్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పని చేస్తున్న ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులుగా నియామమయ్యారు. జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి, జస్టిస్ సుజనను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వారితో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు. ముగ్గురు న్యాయమూర్తులు 2023 జులై 31న అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఆ ముగ్గురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో మొదటి కోర్టు హాలులో తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణస్వీకారం చేయించారు.