Telangana | జినోమ్ వ్యాలీతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు – రేవంత్ రెడ్డి

హైదరాబాద్ – శామీర్‌పేట (shamirpet ) జినోమ్‌ వ్యాలీతో (Genome Valley ) తెలంగాణ రాష్ట్రానికే (state of telangna ) ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (cm revanth reddy ) .. ఈ వ్యాలీలో ఐకోర్‌ బయాలజిక్స్‌ (ICHOR Biologics) కొత్త యూనిట్ కు నేడు ఆయ‌న‌ భూమిపూజ చేశారు..

ఈ సంద‌ర్బంగా సిఎం మాట్లాడుతూ హైదరాబాద్‌ బ్రాండ్‌ను ప్రపంచంలోనే ఒక ఫార్మా కంపెనీల బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. జినోమ్‌ వ్యాలీ ఎవరూ ఊహించని విధంగా ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందని, ప్రపంచంలో 30 శాతం ఫార్మా ఉత్పత్తులు జినోమ్​ వ్యాలీ నుంచే తయారవుతున్నాయని తెలిపారు. 30,40 ఏళ్లుగా కృషి చేస్తున్న ఫార్మా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం, సకల వసతులు కల్పిస్తూ మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. లారస్‌ ల్యాబ్స్‌, కర్క ల్యాబ్స్‌ సుమారు 300 ఎకరాల్లో రూ.2వేల కోట్లతో వందల మందికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమల ఉత్పత్తి ప్రక్రియలను ప్రారంభించాయని గుర్తు చేశారు.

ప్రపంచ ఫార్మా దృష్టిని ఆకర్షించేందుకు జినోమ్‌ వ్యాలీని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామన్న సీఎం ఫార్మా రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంలా తయారు చేసి ఉపాధి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అందుకే, ఫార్మా కంపెనీల దిగ్గజాలతో మరిన్ని పెట్టుబడులు రాబట్టే ఆలోచనలు విస్తృతంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply