Telangana Praja Jagruthi | పార్టీ పేరుపై క్లారిటీ

Telangana Praja Jagruthi | పార్టీ పేరుపై క్లారిటీ
Telangana Praja Jagruthi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పార్టీ నమోదు వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కొత్త పార్టీ పేరుపై క్లారిటీ వచ్చింది. కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’ (Telangana Praja Jagruthi) అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. ఆమె దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో ఈసీ చెప్పింది.
దీంతో సాంకేతిక లోపాలన్నీ సరిచేసి మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఈసీ చెప్పడంతో కోర్టు విచారణ ముగించింది.
ఈ ఏడాది జనవరి 23న తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో రిజిస్ట్రేషన్ కోసం సీఈసీకి దరఖాస్తు చేసుకోగా… ఈసీ వైపు నుంచి చర్యలు లేకపోవడంతో తమ దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తాజాగా కవిత హైకోర్టును ఆశ్రయించారు. అయితే కవిత పిటిషన్‍పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టులో కవిత ఊరట లభించింది.
