Telangana | మళ్లీ ఐఎఎస్ ల బదిలీలు…
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ తాజా బదిలీల్లో పలువురు ఉన్నతాధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించడంతో పాటు, కొన్ని కీలక విభాగాలకు అదనపు బాధ్యతలు కేటాయించారు.
బదిలీ అయిన అధికారుల వివరాలు:
కె. సురేంద్ర మోహన్ – సహకార కమిషనర్‌గా నియమితులయ్యారు. అదనంగా మార్కెటింగ్ డైరెక్టర్ హోదాను కూడా చేపట్టనున్నారు.
ఎల్. శివకుమార్ – ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ సీఈవోగా బాధ్యతలు నిర్వహించిన శివకుమార్‌ను సాధారణ పరిపాలన శాఖ (GAD) లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆర్.వి. కర్ణన్ – ప్రస్తుతం ఉన్న బాధ్యతలతో పాటు ఆరోగ్యశ్రీ సీఈవో హోదా కూడా కలిగిన అధికారి కానున్నారు.
కె. హరిత – వాణిజ్య పన్నుల డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
యాస్మిన్ బాషా – ప్రస్తుత బాధ్యతలకు తోడు విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ హోదాను కూడా నిర్వహించనున్నారు.
కె. చంద్రశేఖర్ రెడ్డి – తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ ఎండీ గా అదనపు బాధ్యతలు అందుకోనున్నారు.
సంచిత్ గంగ్వార్ – వనపర్తి అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనను నారాయణపేట అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు.
బి. శ్రీనివాస్ రెడ్డి – టెక్స్‌టైల్స్, హ్యాండ్లూమ్స్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని మాతృసంస్థకు తిరిగి బదిలీ చేశారు.
