Telangana | సర్పంచ్, ఉప సర్పంచ్ లకు సన్మానం..

Telangana | సర్పంచ్, ఉప సర్పంచ్ లకు సన్మానం..
Telangana, కుంటాల, ఆంధ్రప్రభ : మహిళా సంఘాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు కృషి చేసి మహిళలకు బ్యాంకుల ద్వారా శ్రీనిధి రుణాలను అందించేందుకు కృషి చేస్తామని ఇటీవల గెలుపొందిన సర్పంచ్ కదాం హిమ్మత్ రావు పటేల్ అన్నారు. గురువారం మండలంలోని పెంచికల్ పాడు గ్రామంలో సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కు, వార్డు సభ్యులకు మహాలక్ష్మి గ్రామ సంఘం తరఫున ఘనంగా సత్కరించారు.
అభివృద్ధికి తన వంతు అండగా ఉంటానని రుణాలను అందించేందుకు కృషి చేస్తానని గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అందరి సహకారంతో అభివృద్ధికి కృషి చేసి అన్ని విధాల మౌలిక వసతులు కల్పిస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆయనను మహిళలు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గురజాల రాములు వివో ఏ సంపత్ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
