Telangana | గృహజ్యోతి @50 లక్షలు..

Telangana | గృహజ్యోతి @50 లక్షలు..

Telangana, హైదరాబాద్, ఆంధ్రపభ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహాజ్యోతి 200 యునిట్ల లోపు వినియోగం చేస్తున్న ప్రతి కుటుంబానికి విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా అందించే గృహాజ్యోతి పథకానికి విశేష ఆదరణ పెరుగుతోంది. ఈ పథకం ప్రారంభమైన దగ్గర్నుంచి నేటి వరకు సుమారు 10 లక్షల మంది వినియోగదారులు పెరిగారు. ఇంకా పెరుగుతూనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం (TG Govt) డిస్కంలకు అందించే సబ్సిడీ మొత్తం రెట్టింపు అయ్యింది. గృహజ్యోతి లబ్దిదారులకు ప్రభుత్వం ప్రతినెలా చెల్లిస్తున్న కోట్లాది రూపాయలు డిస్కంలకు ఊరటను కలిగిస్తున్నాయి. పథకం ప్రారంభమైన 20 నెలల వ్యవధిలో గృహజ్యోతి పథకానికి ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు చెల్లించినట్టుగా అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల విద్యుత్ను వినియోగించేవారికి వారికి జీరో బిల్లు పేరుతో ఉచిత సరఫరా చేస్తోంది. 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కంపెనీల ద్వారా సుమారు 42 లక్షల మంది వినియోగదారులకు జీరో బిల్లు విధానం అమలవుతోంది. ఫలితంగా గృహజ్యోతి లబ్దిదారులు ప్రతినెలా రూ. 200 యూనిట్ల వరకు ఎలాంటి బిల్లులు చెల్లించడం లేదు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు కంపెనీల పరిధిలో సుమారు 42 లక్షల మంది వినియోగదారులకు జీరో బిల్లు లబ్దిదారులుగా ఉన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చి 20 నెలలు అవుతున్నా.. ఇంకా చాలా మంది నిరుపేదలు, 200 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారు జీరో బిల్లు సబ్సిడీ కోసం ఇంకా విద్యుత్, మున్సిపల్, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులు జీరో బిల్లులు పొందుతూ గృహజ్యోతి పథకాన్ని లబ్దిపొందుతున్నారు. వీటిలో ఎస్ పీడీసీఎల్ పరిధిలో 25.31 లక్షలు కాగా, ఎస్పీడీసీఎల్ పరిధిలో 25.22 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. సాధారణంగా బిల్లుల వసూళ్లలో నిర్లక్ష్యం, సిబ్బంది ఎంత తిరిగిన మొండి బకాయిలు వసూలు కాకపోవడంతో కోట్లాది రూపాయలు విద్యుత్ సంస్థలకు రావాల్సి ఉంది. ఈ లోటును భర్తీ చేసేందుకు డిస్కంలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సబ్సిడీల రూపంలో అందించే ఉచిత విద్యుత్ వినియోగానికి ప్రభుత్వం కాస్తా అటు.. ఇటుగా అయినా.. బిల్లులు చెల్లిస్తున్న కారణంగా ఎస్ పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కంపెనీలకు పెద్ద ఊరట కలుగుతోందనే భావించవచ్చు.

గృహజ్యోతి (Gruha Jyothi Scheme) పథకం ప్రారంభం అయిన మొదటి నెలలో 42 లక్షల మంది వినియోగదారులకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి ప్రభుత్వం సుమారు రూ. 98 కోట్లు చెల్లించినట్టుగా సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ నాటికి (గత నెల ఈ మొత్తం మరో రూ. 100 కోట్లు పెరిగి మొత్తం రూ. 1.98 కోట్లకు పెరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. దీంతో రెండు కంపెనీలకు ప్రతినెలా దాదాపు రూ. 100 కోట్లు చొప్పున చెల్లిస్తుండగా.. మొత్తం ఈ 20 నెలల కాలంలో ఇప్పటి వరకూ సుమారు రూ. 3 వేల కోట్ల వ్యయాన్ని గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించింది. రానున్న రోజుల్లో గృహజ్యోతి లబ్దిదారులు పెరిగితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

మరి కొన్ని వార్తలకు లింక్ క్లిక్ చేయండి.
https://epaper.prabhanews.com

Leave a Reply