Telangana | గూడెం దేవాలయానికి పోటెత్తిన భక్తులు.
- సత్యదేవునికి ప్రత్యేక పూజలు
Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధ చెందిన దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి(Goodem Satyanarayana Swamy) దేవాలయానకి ఈ రోజు భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో, జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
సత్యదేవుడి దర్శనం(Sathyadev’s darshan) కోసం భక్తులు బారులు తీరారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకొని సత్యదేవుడిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్, ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్(Srinivas), సిబ్బంది భక్తులకు వసతులు కల్పించి పర్యవేక్షించారు. మహిళలు ప్రధాన ఆలయం ముందు గుట్ట కింద రావి చెట్టు వద్ద భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు.

