Telangana 3pm | కేబినెట్‌ సమావేశం..

Telangana 3pm| కేబినెట్‌ సమావేశం..

Telangana 3pm, హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల పై చర్చించనున్నారు. అలాగే అందెశ్రీ (Andhe sri) స్మృతి వనం, అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం పై ఇచ్చే విషయం పై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఈ నెల 24వ తేదీలోగా తెలియచేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తేలకపోవడం వలనే అవి వాయిదాపడుతూ వస్తున్నాయి. అయితే.. ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో గెలిచిన ఉత్సాహంతో వచ్చే నెల చివరి లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది. దీని గురించి ప్రధానంగా కేబినెట్ లో చర్చించనున్నారని సమాచారం.

Leave a Reply