రేపటికి వాయిదా..

- ఎమ్మెల్యే మాగంటి సంతాప తీర్మానంతో ముగిసిన సమావేశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ (Telangana) లోని శనివారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారు. ఈ రోజు ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) అకాల మరణంపై సంతాప తీర్మానం సీఎం రేవంత్ రెడ్డి ద్వారా సభలో ప్రవేశపెట్టారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి (RevanthReddy), బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ లు మాగంటి సేవలను గుర్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి గోపీనాథ్ ఎంతో కృషి చేయాలని గుర్తు చేశారు. తెలంగాణ (Telangana) అసెంబ్లీని రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ ఇప్పుడే ప్రారంభమైంది.
ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహణపై ఇందులో చర్చించనున్నారు.
