తెలంగాణలో 26 కాలేజీలకు నోటీసులు
జరిమానాలు లేకుండానే పునరుద్ధరణ
నాలుగు నెలల్లో సరిచేస్తామన్న మేనేజ్‌మెంట్లు
మౌలికవసతులు కల్పించాలని ఆదేశాలు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : (New Delhi )
ఇటీవల రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీల్లో (medical colleges ) మౌలిక వసతులు సరిగా లేవని జాతీయ వైద్య మండలి (medical council of India ) నోటీసులు ( Notice )జారీ చేసింది. అయితే.. 2025-26 విద్యా సంవత్సరానికి గాను అన్ని మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ పర్మిషన్‌ను (NMC permission ) రెన్యువల్ చేసింది. గతేడాది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో లోపాలు గుర్తించిన ఎన్ఎంసీ జరిమానాలు విధించగా.. ఈ ఏడాది ఎలాంటి జరిమానాలు లేకుండానే అనుమతులను పునరుద్ధరించింది. గత నెల 18వ తేదీన ఢిల్లీలోని ఎన్ఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈలు రాష్ట్రంలోని వైద్య కళాశాలలో నెలకొన్న సమస్యలను నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నాలుగు నెలల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశిస్తూ ఎన్ఎంసీ వైద్య కళాశాలల అనుమతులను పునరుద్ధరించింది.