Telangana | నిందితులు అదుపులో..

Telangana | నిందితులు అదుపులో..

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం డివిజన్ పరిధిలో మహదేవపూర్ ప్రాంతంలో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి సమీపంలోని పార్కులోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం.

దాడి కారణంగా బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

Leave a Reply