Telangana | నలుగురు దుర్మరణం..

Telangana | నలుగురు దుర్మరణం..
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఘోర రోడ్డుప్రమాదం జరిగి.. నలుగురు దుర్మరణం పాలైన విసాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి నలుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. 22 మంది ప్రయాణీకులతో హైదరాబాద్ నుంచి అకోలా వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఇందల్వాయి మండల పరిధిలోని గన్నారం సమీపంలోకి చేరుకుంది. ఈ క్రమంలోనే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో అసలు ఏం జరిగిందో తెలియక హాహాకారాలు చేశారు.

ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
