Telangana | కుటుంబ కలహాలతోనే ఆ పనిచేశాడా…!

Telangana | కుటుంబ కలహాలతోనే ఆ పనిచేశాడా…!
Telangana| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అత్తకు అల్లుడు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన గార్ల మండలం సీతంపేట శివారు మంగళతండాలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త కంసాలి (48)ని అల్లుడు రాజేశ్ (32) హతమార్చాడు. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రాజేశ్ దాడి నుంచి అతడి మామ, తల్లిదండ్రులు తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
