Telangana | భక్తుల ట్రాక్టర్ బోల్తా.. తల్లీకూతుళ్లు మృతి

Telangana | భక్తుల ట్రాక్టర్ బోల్తా.. తల్లీకూతుళ్లు మృతి

Telangana | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బోల్తాపడి తల్లీకూతుళ్లు మృతిచెందగా, 8మందికి గాయాలయ్యాయి. కాగజ్ నగర్‌కు చెందిన సుమారు 20 మంది భక్తులు ట్రాక్టర్ లో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు బయలుదేరారు. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కేశవపూర్ శివారులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Telangana

Leave a Reply