243 స్థానాల్లో పోటీ సై

( ఆంధ్రప్రభ, ముజాఫర్ పూర్): బీహార్(Bihar) మహాఘట్భంధన్ కూటమి గొంతులో వెలక్కాయను ఆర్జేడీ నేత తేజస్వి ప్రసాద్ యాదవ్(RJD leader Tejashwi Prasad Yadav) కుక్కారు. రాబోయే ఎన్నికల్లో 243 అసెంబ్లీ స్థానాల్లో(In 243 assembly seats) పోటీ చేస్తానని ప్రకటించి, మహాఘట్బంధన్ లో సింహభాగం సీట్లు తనవేనని తేల్చిచెప్పారు. ముజఫర్ పూర్(Muzaffarpur)లోని కాంతిలో జరిగిన కార్మికుల ర్యాలీ(Workers rally)లో ఈ ప్రకటన చేశారు. మహాఘట్బంధన్‌లో సీట్ల పంపకాల చర్చలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక్కడి కాంతి హైస్కూల్‌లో కిక్కిరిసిన జనసమూహాన్ని ఉద్దేశించి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)పై విమర్శనాస్ర్తాలు సంధించారు. మేము తిరిగి వస్తాం. అర్థం చేసుకోండి, బీహార్‌లోని 243 సీట్లలోనూ తేజస్వి పోటీ చేస్తారు.
బీహారీ సీట్ల కుంపటి
ముజఫర్ పూర్, బోచాహన్, గైఘాట్ కాంతితో సహా నియోజకవర్గాల పేర్లను ఆయన ప్రస్తావించారు, కార్మికులను సిద్ధంగా ఉండాలని కోరారు. యాదవ్ ప్రస్తావించిన ముజఫర్‌పూర్(Muzaffarpur) ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్వహిస్తున్నారు. సీట్ల పంపకాల చర్చల సమయంలో కూటమి భాగస్వాములపై ఒత్తిడి తీసుకురావడమే ఈ సందేశం లక్ష్యంగా పెట్టుకుందనే ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నారు. యాదవ్ ప్రకటన రాజకీయంగా చాలా ముఖ్యమైనది. ఇటీవల మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి అడిగినప్పుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రత్యక్ష సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. ఈ స్థితిలో యాదవ్ ప్రకటన తో తారాస్థాయి చర్చ రగులుతోంది.
