Team Organizers | బాల్య మిత్రుని కుటుంబానికి బాసటగా..

Team Organizers | బాల్య మిత్రుని కుటుంబానికి బాసటగా..

Team Organizers | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : మండలంలోని చందారం గ్రామానికి చెందిన రామాంజనేయులు ఇటీవల గుండెపోటుతో మరణించడంతో 1990-91 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు మృతుని కుటుంబానికి బాసటగా నిలిచారు. ఈ రోజు తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచే క్రమంలో మిత్రులందరూ కలిసి రూ. 20 వేల నగదు(Rs. 20 thousand cash) జమ చేసి అతని కుటుంబానికి అందజేశారు.

రామాంజనేయులు మంచితనం మరువలేనిదని, అందరితో ఎంతో బాగా ప్రవర్తించేవాడని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో టీం ఆర్గనైజర్స్(Team Organizers) ఇండ్ల సత్యనారాయణ, చిప్పకుర్తి నారాయణ, నాగభూషణం, సుదర్శన్, లింగన్న, రమేష్, అశోక్, రవి, సత్తయ్య, వెంకటస్వామి, దుర్గయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply