ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలి రెండు వన్డేలో ఘోరంగా విఫలమైన భారత్.. మూడో వన్డేలో బ్యాటింగ్, బౌలంగ్‌లో సత్తాచాటింది. మూడవ వన్డేలో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో 2-1 తేడాతో సిరీస్ ను టీమిండియా ముగించింది. అటు ఈ విజయంతో గిల్ కెప్టెన్సీలో తొలి వన్డేను గెలుచుకుంది టీమిండియా. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి, 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఒకే వికెట్ కోల్పోయి 38.3 ఓవర్లలో 237 పరుగులు చేసింది టీమిండియా.

రోహిత్ శర్మ సెంచరీ.. కోహ్లీ హాఫ్ సెంచరీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. వన్డల్లో అతనికి ఇది 33వ సెంచరీ. 105 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో శర్మ సెంచరీ పూర్తి చేశాడు. 237 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్.. విజయం వైపు దూసుకెళ్తోంది. రోహిత్, కోహ్లీ అజేయంగా రెండో వికెట్‌కు 100 పైగా రన్స్ జోడించారు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టిన రోహిత్, ఇక మూడో వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్నాడు. బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. వీలైన సందర్భంలో సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి బ్యాటింగ్ చేస్తున్నాడు.



