విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
వంగూర్, ఆంధ్రప్రభ : వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిండి చింతపల్లి గ్రామ సర్పంచ్ రామ్ భీష్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి పాఠాలు బోధిస్తూ ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్ రామ్ భీష్మ బహుమతులు అందజేసి అభినందించారు.
విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, క్రమశిక్షణతో చదువుకుంటూ మంచి పౌరులుగా ఎదగాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.
