Tea Poll App | పోస్టల్ బ్యాలెట్ పనుల పరిశీలన…
Tea Poll App | వర్ని, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికలలో ఉద్యోగులు ఉపయోగించుకునే పోస్టల్ బ్యాలెట్(Postal ballot) పత్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వర్ని మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పనులను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ లను వరుస సంఖ్యలో నింపాలని సూచించారు.
టీ పోల్ యాప్(Tea Poll App) ద్వారా ఓటింగ్ వేసే విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్ సిప్ లను ఇంటింటికి అందించడానికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తాసిల్దార్ సాయిలు ఎంపీడీవో వెంకటేశ్వర్ ఉన్నారు.

