TDP MLA | దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదుచేయాలి

TDP MLA | దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదుచేయాలి

  • ఆంధ్రప్రదేశ్ కాపు యువసేన అధ్యక్షుడు కర్ణా శ్రీనివాసరావు

TDP MLA | శావల్యాపురం, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద దాడి చేసి, ఇంటిని, వాహనాలను ధ్వంసం చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాపు యువసేన అధ్యక్షుడు కర్ణా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ ఎమ్మెల్యే, ఆమె భర్త, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఈ దాడిలో ప్రత్యక్షంగా పోల్గొని విధ్వంసం సృష్టించారని అంబటి రాంబాబు దొరికితే ఖచ్చితంగా హత్య చేసేవారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచి పద్దతి కాదన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవిలో ఉన్న మహిళ విచక్షణారహితంగా అంబటి రాంబాబుని అసభ్యపదజాలంతో దూషిస్తూ అంబటి రాంబాబు వెంట పడడం దుర్మార్గమన్నారు. దారిలో వెళుతున్న అంబటిని అడ్డగించి దూషిస్తూ, రెచ్చగొడుతూ టీడీపీ వారు చేసిన దౌర్జన్యాన్ని రాష్ట్ర ప్రజలంతా చూసారన్నారు. ఆ రోజు దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరుతున్నామన్నారు.

Leave a Reply