TDP Counter | “సిట్ పడింది.. తగలబడింది” ….
వెలగపూడి – తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై టీడీపీ పార్టీ స్పందించింది. “సిట్ పడింది.. తగలబడింది”… జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదంపై అంటూ టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిందంటూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసింది టీడీపీ. దీంతో… జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదంపై టీడీపీ పార్టీ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
కాగా, తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి బయట రోడ్డు పక్కన ఉన్న గార్డెన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేయడంతో మంటలు అంటుకున్నట్లు సమాచారం అందుతోంది. గడ్డి బాగా ఎండిపోయి ఉండడంతో నిప్పు అంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే… సెక్యూరిటీ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదం వీడియో వైరల్ గా మారింది.
పి 4 విధానానికి శ్రీకారం..
ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఏపీలో పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పీ-4 విధానానికి శ్రీకారం చుట్టారు. పీ-4 ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న 20శాతం మంది పేదలకు, ఆర్థికంగా బలంగా ఉన్న 10శాతం మంది స్వయం ఉపాధి పొందేలా చేయూతనందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పీ-4లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఓ వీడియోను ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసింది టీడీపీ పార్టీ.