కుమ్మరి సంఘం నుండి పన్ను వసూలు..

నార్సింగి, ఆంధ్రప్రభ : నార్సింగి గ్రామంలోని కుమ్మరి సంఘం సభ్యుల నుండి గ్రామపంచాయతీ సిబ్బంది పన్నులను వసూలు చేశారు. గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ ఆధ్వర్యంలో సంఘం ప్రాంతాన్ని సందర్శించి పన్ను బకాయిల వివరాలను తెలియజేసి, చెల్లించిన వారికి రశీదులు అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పనులు సమర్థవంతంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ పన్నులు సకాలంలో చెల్లించాలని కోరారు. పన్నుల ద్వారా గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్, పంచాయతీ సిబ్బంది, కుమ్మరి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
