జగన్మాతను దర్శించుకున్న తమిళనాడు గవర్నర్….

  • ఆర్ ఎన్ రవి కుమార్ కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం…
  • అమ్మవారికి ప్రత్యేక పూజలు….
  • గవర్నర్ కు ఆలయ అభివృద్ధి పనులు వివరించిన ఈవో…

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోనే ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతను తమిళనాడు గవర్నర్ ఆర్. ఎన్. రవి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనా నాయక్, వేద పండితులు, అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండిత ఆశీర్వచనం పండితులు అందించగా, శ్రీ అమ్మ వారి చిత్రపటం, ప్రసాదం ఈవో, చైర్మన్ అందించారు.

… ఆలయ అభివృద్ధికి దాతల సహకారం అవసరం…

తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి అమ్మవారి దర్శనం అనంతరం మహా మండపం 6వ అంతస్తులో దాతల సమావేశంలో దాతల తో పాటు గవర్నర్ పాల్గొని, అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవో వివరించారు.

Leave a Reply