రాష్ట్రస్థాయిలో నెట్ బాల్ పోటీల్లో ప్రతిభ
ప్రశంసలు అందుకుంటున్న కోన సముందర్ విద్యార్థిని
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : ఏడో రాష్ట్రస్థాయిలో నెట్ బాల్ పోటీల్లో కోనాసముందర్ జెడ్పీ పాఠశాలకు చెందిన వి.సంధ్య ప్రతిభ చాటింది. ఈనెల 10 నుంచి 12వ తేదీలలో 33 జిల్లాలు పాల్గొన్నాయి. 10వ తరగతి చదువుతున్న సంధ్య అత్యంత ప్రతిభా కనబరిచి నిజామాబాద్ జిల్లా తృతీయ స్థానం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని, పీడీ రమేష్ గౌడ్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మధుపాల్, వీడీసీ అధ్యక్షులు మెల్ల గంగాధర్, వీడీసీ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయుల బృందం అభినందించారు.