మోత్కూర్ లో టైలర్స్ డే వేడుకలు…

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు శనివారం స్థానిక పాత బస్టాండ్ వద్ద ఘనంగా జరుపుకున్నారు. విలియమ్స్ హోవే జన్మదినం సందర్భంగా టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా రవి విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి, టైలర్స్ డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు పోచం కనక సేన, గౌరవ అధ్యక్షులు జిల్లా వేణు, ప్రధాన కార్యదర్శి దండ సత్యం, కోశాధికారి ఎడ్ల చంద్రయ్య, సహాయ కార్యదర్శి నిలిగొండ నరసయ్య, కార్యవర్గ సభ్యులు రచ్చ ఈశ్వరయ్య , జిల్లా యాదగిరి , దునుక అంజయ్య , పుల్కరపు రాజయ్య , జుంజూరు బిక్షపతి , జవ్వాజి వెంకటేశ్వర్లు, దబ్బటి ఎల్లయ్య, పోల్కం శేషయ్య , జనిగల నరసింహ , బిరుదు శ్రీను ఎంగలి అనిల్ కుమార్ , జల్ది సత్యం , మేడిగ రవి , రేణుకుంట్ల కోటయ్య , తదితరులు పాల్గొన్నారు

Leave a Reply