తహసీల్దార్‌ని కలిసిన బీఆర్ఎస్ నాయకులు…

తహసీల్దార్‌ని కలిసిన బీఆర్ఎస్ నాయకులు…
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలానికి నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ రెడ్డి ని సోమవారం వారి కార్యాలయంలో రఘునాథపల్లి మండల మాజీ ఎంపీపీ వై కుమార్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ముసిపట్ల విజయ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు గూడ కిరణ్ కుమార్, కొర్ర రాజేందర్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నూనెముంతల యాకస్వామిగౌడ్, నియోజకవర్గ మహిళా ఇంచార్జీ మడ్లపల్లి సునీత, మండల యూత్ అధ్యక్షులు దుబ్బాక హరీష్ గౌడ్, మండల నాయకులు బండి కుమార్, మడ్లపల్లి రాజు,ముప్పిడి సాంబ, మార్కల మహేందర్ రెడ్డి, నూనావత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
