ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…

ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…
- మండల బిజెపి డిమాండ్
వేంసూరు, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ మండల బీజేపీ నాయకులు తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వివిధ రకాల పెన్షన్లు పెంపుదల, అర్హులకు పెన్షన్లు మంజూరు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, జీవన భృతి, రెవెన్యూ సదస్సుల్లో రైతులు అందించిన భూ సమస్యల పరిష్కారం, అర్హులందరికీ నివాస గృహాలు మంజూరు వంటి పలు విషయాలపై తక్షణమే ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయంలో అందజేశారు.
వినతి పత్రం అందించిన వారిలో మండల బీజేపీ అధ్యక్షులు గొర్ల ప్రభాకర రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగ సురేంద్ర రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బండి వెంకటరెడ్డి, కొప్పుల మధుసూదన రెడ్డి, భీమిరెడ్డి బాలకృష్ణారెడ్డి, కిన్నెర మహేష్, మాదిరాజు శ్రీనివాసరావు తోపాటు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
