t20 captain | కెప్టెన్సీపై సూర్య

t20 captain | కెప్టెన్సీపై సూర్య
t20 captain |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తనకు కెప్టెన్సీ ఎలా దక్కిందో ఇటీవల సూర్యకుమార్ యాదవ్ వివరించారు. నా నియామకం వెనుక నలుగురు వ్యక్తులున్నారని.. వారి వల్లే తాను కెప్టెన్ అయ్యానని సూర్య వెల్లడించాడు. అందరు అనుకున్నట్లు కోచ్ గంభీర్ వల్ల తాను కెప్టెన్ అయ్యనని అనుకుంటున్నారని, అది తప్పు అని చెప్పాడు. కేవలం మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు రాహుల్ ద్రవిడ్, అప్పటి బీసీసీఐ సెక్రటరీ జై షా కలిసి తనను కెప్టెన్‌ను చేయాలనే నిర్ణయం తీసుకున్నారని సూర్య తెలిపాడు.
గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టకముందే తనకు టీ20 కెప్టెన్సీ దక్కిందని వివరించాడు. శ్రీలంకతో సిరీస్‌కు మూడు, నాలుగు రోజుల ముందే అప్పటి బీసీసీఐ సెక్రటరీ జై షా నాకు ఫోన్ చేశారు. రాబోయే టీ20 సిరీస్‌కు నేను కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నానని తెలియజేశారు. ఆ తర్వాతే గౌతమ్ గంభీర్ జట్టులోకి వచ్చారని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తను కెప్టెన్ కావడానికి కోచ్ గంభీర్ ఏ మాత్రం కారణం కాదన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తరఫున ఈ ఇద్దరు కలిసి ఆడటంతో వారి మధ్య సాన్నిహిత్యం ఉందని, దాంతోనే గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని గతేడాదిన్నరగా ప్రచారం జరుగుతుంది.
