హైదరాబాద్ – తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్ట పరచాలని అభిప్రాయపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్.. బ్రిటిష్ వాళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ విస్తృత భావజాలం ఉన్న పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ జాతీయ స్థాయి ఆలోచనలతో పార్టీ పని చేస్తుందని వెల్లడించారు.
నేడు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మీనాక్షి మాట్లాడుతూ, జిల్లాకు ఇద్దరు పరిశీలకుల కేటాయింలన్నారు. . మండల అధ్యక్షుల ఎంపికకు ఐదుగురి పేర్లు.. బ్లాకు కాంగ్రెస్ కి ముగ్గురు పేర్లు పీసీసీకి ఇవ్వాలని కోరారు. 70 మంది పరిశీలకులకు ఆహ్వానం పంపించాలని కోరారు. ఇక ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వాళ్ళను పరిశీలకులుగా పీసీసీ తొలగించింది. మీటింగ్ కి రాని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు మరో ఐదుగురు నేతలు పరిశీలకుల నుంచి వీళ్ళను తొలగించాలని మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేశారు.

2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకే
ఇక, 2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళనే కమిటీలో ఉండాలని నటరాజన్ ఆదేశించారు. అలాగే, మహిళల ప్రాతినిధ్యం పెంచుకోవాలన్నారు..ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు జరగనున్నాయని ప్రకటించారు.
పార్టీ సిద్ధాంత ప్రచారం, సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచి జరగాలి అని సూచనలు చేశారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చాలా చిత్తశుద్ధితో సీరియస్ గా పని చేయాలని హెచ్చరించారు. ఈ దేశంలోనే మొదటి సరిగా తెలంగాణలో కుల గణన చేసి 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. అలాగే, దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిదన్నారు.. అయితే, దేశంలో మోడీ సర్కార్, గత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తమ ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అని మీనాక్షి నజరాజన్ కాంగ్రెస్ పరిశీలకులను కోరారు.
పర్యాటకుల మృతికి సంతాపం

టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణు నాథ్, సీడబ్ల్యూసి సభ్యులు వంశీ చంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు… సమావేశం ప్రారంభమైన అనంతరం జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల మృతి పట్ల సంతాపం ప్రకటించారు.. హాజరైన సభ్యులు లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించారు.