అక్షరభ్యాస మండపంలో స్వామివారి అనుగ్రహ భాషణం
బాసర, ఆంధ్ర ప్రభ : తెలంగాణా రాష్ట్ర విజయ యాత్రలో భాగంగా శుక్రవారం బాసర పుణ్య క్షేత్రానికి దక్షిణామ్నాయ శృంగేరి పీఠం జగద్గురువులు విదుశేఖర భారతి మహాస్వామి విచ్చేయనున్నట్లు బాసర ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి గురువారం తెలిపారు.
వ్యాసాలయం నుండి శ్రీ స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం అనంతరం అమ్మవారి దర్శనం తదుపరి ధూళి పాదపూజ శ్రీ స్వామివారిచే సాధారణ అక్షరాభ్యాస మండపంలో స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుందన్నారు. అనంతరం గోదావరి సమీపాన గల చంద్రమౌళీశ్వర ఆలయంలో మహాపూజలో పాల్గొననున్నట్లు తెలిపారు.

