డోన్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పద ఘటన…

డోన్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పద ఘటన…
- కాలు విరిగి పడిన వ్యక్తి..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; నంద్యాల జిల్లా డోన్ రైల్వే స్టేషన్లో గురువారం అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ మొదటి ప్లాట్ఫాం చివర భాగంలో ఓ వ్యక్తి కాలు విరిగిన స్థితిలో పడివున్నట్లు ప్రయాణికులు గమనించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడిన వ్యక్తిని పరిశీలించారు.
అనంతరం అతనిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించరు.అయితే ఆ వ్యక్తి ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయంలో స్పష్టత రాలేదు. రైలు ఎక్కే లేదా దిగే సమయంలో జారి పడ్డాడా, లేక ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్నదానిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
