Suspicious death | అనుమానాస్పద మృతి..
Suspicious death, ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ : పట్టణంలోని శివ సర్కిల్ సమీపంలో ఉన్న ఏటీఎమ్ (ATM) సెంటర్ ముందు ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతుడిని ఒడిషా రాష్ట్రానికి చెందిన టికేలాల్ బరియా (36) గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద లభించిన ఆధార్ కార్డు, ఏటీఎమ్ కార్డు ఆధారంగా గుర్తింపు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. టికేలాల్ బరియా ఎమ్మిగనూరు మండలం చెన్నాపురంలోని ఇటుక బట్టిలో పని చేస్తున్నట్లు సహోద్యోగులు వెల్లడించారు.
మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఇది ఏదైనా అనారోగ్య కారణమా లేదా మరెమైనా అనుమానాస్పద కోణాలు ఉన్నాయా అన్న దాని పై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం జరుపుతున్నట్టు పోలీసు (Police) వర్గాలు వెల్లడించాయి. విచారణ కొనసాగుతోంది.


