Suspension | సీనియర్ ఐఎయస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్

Suspension | సీనియర్ ఐఎయస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్
- ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో ఆరోపణలు
- ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి
Suspension | హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: సీనియర్ ఐఎయస్ అధికారి అరవింద్ కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణ వ్యవహారంలో ఉద్భవించిన వివాదాలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణలో పరిపాలనా లోపాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అరవింద్ కుమార్‌పై ప్రాసిక్యూషన్ కొనసాగించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెన్షన్ విధించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామం రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
