Suryapet | ఆర్థికంగా ఎదగాలి

Suryapet | ఆర్థికంగా ఎదగాలి
‘టీ’ తాగుదాం కప్పు తినేద్దాం – ‘క్రంచీ కప్స్’ తయారీలో యువకుడు
ఉద్యోగం వదిలి, మరోవైపు పర్యావరణహితంగా ‘క్రంచీ కప్స్’ తయారీలో యువకుని ప్రావీణ్యం
Suryapet | సూర్యాపేట, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా యువత స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ (Agricultural Market Committee) చైర్మన్ కొప్పుల వేణారెడ్డి (Koppula Venareddy) అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త మార్కెట్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎడిబుల్ టీ కప్పుల తయారీ పరిశ్రమ కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటుకు ‘టీ తాగండి – కప్పు తినండి’ కాన్సెప్ట్‌తో క్రంచీకప్స్ యూనిట్ (Crunchycups Unit) ను నెలకొల్పిన యజమాన్యంను అభినందించారు. యువత ప్రైవేట్ రంగాల్లో అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. కాస్త చదువు, ఇంకాస్త సృజనాత్మకత తోడైతే ఎలాంటి విజయాలైనా సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ముక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
