Suryapet | సుత్తెతో…

Suryapet | సుత్తెతో…
Suryapet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ప్రేమించిన యువతి తనను దూరం పెడుతుందన్న కారణంతో యువకుడు ఆమెపై సుత్తెతో దాడి చేశాడు. సూర్యాపేట పట్టణంలోని స్నేహనగర్ లో దారుణం జరిగింది.
ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడటంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే స్థానికులు నిందితుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
