surveillance | పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా

surveillance | పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా
అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
surveillance | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాత నేరస్తుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా (surveillance) పెట్టారు. మంగళవారం అర్ధరాత్రి ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్లగొండ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలువురు పాత నేరస్తుల ఇండ్లను తనిఖీ చేశారు. ముషంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేక తనిఖీల్లో (special inspections) జిల్లా పోలీసు బృందం పాల్గొంది.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవర్ (Sharat Chandra Pawar) మాట్లాడుతూ… అసాంఘీక చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో వివాదాలకు దూరంగా శాంతియుతంగా జీవించాలని రౌడీషీటర్లకు సూచించారు.
ఎన్నికల (Election) నేపథ్యంలో ప్రతి ఒక్కరిపై పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు. గత ఎన్నికల గొడవల కేసుల్లో ఉన్న నేరస్థులను ఇప్పటికే బైండోవర్ చేసినట్టు చెప్పారు. బైండోవర్ ఉల్లంఘించినా, కొత్తగా గొడవలకు దిగినా.. తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదాబాబు, తదితరులు పాల్గొన్నారు.
