Delhi | పీజీ వైద్య సీట్ల భర్తీపై సుప్రీం సంచలన తీర్పు

  • స్థానిక కోటా రద్దు

పీజీ మెడికల్‌ సీట్ల భర్తీపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పీజీ మెడికల్‌ సీట్ల భర్తీలో గతంలో ఉన్న రాష్ట్ర‌ 50 శాతం స్థానిక కోటా వర్తించదని తేల్చిచెప్పింది. పీజీ వంటి ఉన్నత వైద్య విద్య కోర్సుల రిజర్వేషన్ల విషయంలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు వెల్లడించింది.

”మనకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. దేశంలోని ఏ విద్యాసంస్థలో అయినా చదువుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. ఉద్యోగం, వ్యాపారం చేసుకోవడానికి దేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉంది. అలాగే చదువుకునే హక్కు కూడా ఉందని” ధర్మాసనం స్పష్టం చేసింది.

రాష్ట్ర కోటా సీట్లను కూడా నీట్‌ మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని ఆదేశించింది. తాజా ఆదేశంతో ఇప్పటికే తెలంగాణాలో కాళోజీ నారాయణరావు హెల్త్‌ వర్సిటీ భర్తీ చేసిన పీజీ మెడికల్‌ సీట్ల వ్యవహారంలో ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో నెలకొని ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *